Rishabh pant: రిషబ్ పంత్ విధ్వంసంతో మోహిత్ శర్మ పేరిట ఐపీఎల్ చరిత్రలో చెత్త రికార్డు

  • ఐపీఎల్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 73 పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా మోహిత్ శర్మ
  • రిషబ్ పంత్ చివరి ఓవర్‌లో ఏకంగా 30 పరుగులు బాదడంతో గుజరాత్ బౌలర్ పేరిట అవాంఛిత రికార్డు
  • ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన మోహిత్ శర్మ
with Rishabh last over destruction worst record in IPL history with the name of Mohit Sharma

బుధవారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ రెచ్చిపోయాడు. మోహిత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఏకంగా 30 పరుగులు బాదాడు. మొత్తం 43 బంతులు ఎదుర్కొని 88 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో గుజరాత్ టైటాన్స్‌ బౌలర్ మోహిత్ శర్మ పేరిట అవాంఛిత రికార్డు నమోదయ్యింది. ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా మోహిత్ పేరిట చెత్త రికార్డు నమోదయింది. మొత్తం 4 ఓవర్లు వేసిన మోహిత్ ఏకంగా 73 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. 

ఐపీఎల్ 2018 ఎడిషన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌ బౌలర్ బాసిల్ థంపి 4 ఓవర్లు వేసి 70 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ చెత్త రికార్డు ఇప్పుడు మోహిత్ శర్మ పేరిట నమోదయింది.

ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్లు..
1. మోహిత్ శర్మ - 0/73 (గుజరాత్ వర్సెస్ ఢిల్లీ) 2024
2. బాసిల్ థంపి - 0/70 (హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు) 2018
3. యష్ దయాల్ - 0/69 (గుజరాత్ వర్సెస్ కోల్‌కతా) 2023
4. రీస్ టాప్లీ - 0/68 (బెంగళూరు వర్సెస్ హైదరాబాద్) 2024
5. అర్ష్‌దీప్ సింగ్ - 0/66 - (పంజాబ్ వర్సెస్ ముంబై) 2023.

ఇక మరోవైపు చివరి ఐదు ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 97 పరుగులు రాబట్టింది. దీంతో చివరి ఐదు ఓవర్లలో అత్యధిక పరుగులు సాధించిన రెండవ జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. 

ఐపీఎల్‌లో చివరి 5 ఓవర్లలో అత్యధిక పరుగులు
1. గుజరాత్ లయన్స్‌పై బెంగళూరు - 112 (2016)
2. గుజరాత్‌ టైటాన్స్‌పై ఢిల్లీ - 97 (2024)
3. ముంబైపై పంజాబ్ - 96 (2023)
4. ఢిల్లీపై ముంబై - 96 (2024)
5. కోల్‌కతాపై బెంగళూరు - 91 (2019).

More Telugu News